విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థకు ఉన్న పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి, నిర్మాణాలకు ముందే ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ రిలీజ్ చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గుంటూరు నగరంలోని జిటి రోడ్ లో నిర్మించిన జ్యోతిర్మయి ప్రాపర్టీస్ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థల పన్ను రూ.1.5 కోట్ల చెక్ ను మంగళవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.నాగ వంశీ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఖాళీ స్థలానికి పన్ను చెల్లించాలని, చెల్లించకుంటే అందులో నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయబోమని స్పష్టం చేశారు. బకాయి పన్నులు చెల్లించినట్లు రెవెన్యూ అధికారి సర్టిఫై చేయాలన్నారు. సచివాలయాల వారీగా పన్ను విధింపు, వసూళ్ళపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ఖాళీ స్థల పన్ను చెల్లించిన జ్యోతిర్మయి ప్రాపర్టీస్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారి రవి కుమార్ పాల్గొన్నారు.
Tags guntur
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …