రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థ లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తుమ్మలావ వద్ద సాయంత్రం తుమ్మలావ అంబేద్కర్ భవనం వద్ద దేవిచౌక్ నుండి నల్లఛానల్ వరకు రూ.238 లక్షలతో చేపట్టనున్న పనులకి శంఖుస్థాపన చెయ్యడం జరిగింది. రూ.238 కోట్ల తో చేపట్ట నున్న 770 మీటర్ల పొడవు, 1.50 మీటర్లు వెడల్పు, ఎత్తు తో కూడి స్టార్మ్ వాటర్ కాలువ నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఎంపి మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఎస్ ఈ పాండురంగారావు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …