విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 12వ సచివాలయం పరిధిలోని హరిజనవాడ ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ,వలంటీర్ వ్యవస్థ లతో ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది చేకూరుతుంది అని అన్నారు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ అధికార టీడీపీ వారు ఉండి కూడా ఈ డివిజన్ లో అభివృద్ధి ఏమి జరగలేదు అని, వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మా ప్రాంతానికి మోక్షం వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ఇటీవల ఉదయపు వాడ బాట కార్యక్రమంలో ఇక్కడ పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు మంచినీటి సమస్య గురుంచి మా దృష్టికి తీసుకురాగా తక్షణమే పరిష్కరించమని తెలిపారు.ఒక వైపు జగన్ గారు ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించని రీతిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో ఆదరణ పొందుతుంటే ఓర్వలేక ఆ నాయకులు నోటికి వచ్చినట్టు బూతులతో ప్రభుత్వాన్ని విమర్శించడం బాధాకరమని అన్నారు. పెద్ద మనిషిగా చెలామణి అయ్యే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేయలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మీ షో రాజకీయాలకు కాలం చెల్లిందని మీ డ్రామాలు ఇక ప్రజలు ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ప్రజల మద్దతుతో అటు రాష్ట్రంలో ఇటు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి, 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి, సునీత, బొడ్డు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …