Breaking News

సిఎస్ గా డా.సమీర్ శర్మ సేవలు అభినందనీయం-ఉద్యోగులందరికీ ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్ శర్మ రాష్ట్రానికి అందించిన సేవలు అభినందనీయమైనవని నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు,ఉద్యోగులు కొనియాడారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డా.సమీర్ శర్మ నవంబరు 30వతేదీ బుధవారం పదవీ విరమణ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్యర్యంలో వీడ్కోలు,స్వాగత కార్యక్రమం జరిగింది.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో సిఎస్.డా.కెఎస్.జవహర్ రెడ్డి సహా పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు,అధికారులు పాల్గొని సిఎస్ గా డా.సమీర్ శర్మ రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ సిఎస్ గా పదవీ విరమణ చేసిన డా.సమీర్ శర్మ వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.ముఖ్యంగా ఆయన ఎక్కువ కాలం పట్టణాభివృద్ధి శాఖలో పనిచేయడం జరిగిందని పేర్కొంటూ ఆయనతో పనిచేసే అవకాశం కలిగినందుకు తనకు ఆనందంగా ఉందని తెలిపారు.డా.సమీర్ శర్మ సేవలు అన్ని విధాలా అభినందనీయమని పేర్కొంటూ ఉద్యోగులందరికీ ఆయన మార్గదర్శకునిగా నిలిచారని సిఎస్.డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
సిఎస్ గా పదవీ విరమణ చేసిన డా.సమీర్ శర్మ మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో అందించిన సేవలు తనకు పూర్తి సంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు.ఇందుకు తనకు సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు,తన సహచర ఉన్నతాధికారులు సహా ఉద్యోగులందరికీ డా.సమీర్ శర్మ పేరుపేరున కృతజ్ణతలు తెలియజేశారు.నూతన సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన డా.జవహర్ రెడ్డికి కూడా అధికారులు సిబ్బంది అంతా వారి పూర్తి సహాయ సహకారాలను అందించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను మరింత పటిష్టవంతంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని అంతటినీ సమర్దవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు డా.జవహర్ రెడ్డి కృషి చేస్తారని ఆంకాక్షిస్తున్నట్టు డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.
ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్,సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్,ఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,సెర్ప్ సిఇఓ ఇంతియాజ్,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ కుమార్ తోపాటు ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ లు మాట్లాడుతూ సిఎస్ గా పదవీ విరమణ చేసిన డా.సమీర్ శర్మ సేవలను కొనియాడడం తోపాటు నూతన సిఎస్.డా.కెఎస్.జవహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంకా ఈకార్యక్రమంలో అమరావతి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి,ఎపి గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కృష్ణయ్య తదితరులు మాట్లాడుతూ డా.సమీర్ శర్మ సేవలను కొనియాడారు.
అనంతరం నూతన సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ పుష్పగుచ్చాన్ని అందించి దుశ్శాలువ,జ్ణాపికతో సత్కరించారు.అలాగే సిఎస్ గా పదవీ విరమణ చేసిన డా.సమీర్ శర్మకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ పుష్పగుచ్చాన్నిఅందించి దుశ్శాలువ,జ్ణాపికతో సత్కరించారు.ఈకార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్.రావత్,ముఖ్య కార్యదర్శులు యంటి.కృష్ణ బాబు,అనిల్ కుమార్ సింఘాల్,యం.రవిచంద్ర,ఆర్.ముత్యాల రాజు సహా ఇంకా పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,వివిధ శాఖాధిపతులు, సచివాలయ అదనపు కార్యదర్శలు,ఉప కార్యదర్శులు,సహాయ కార్యదర్శులు,ఇతర అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *