Breaking News

సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలు, జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించాల్సి అవసరం మన పై ఉంది..

-ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
-మంత్రి ఆర్.కె.రోజా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలు, జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించడం లో సాంస్కృతిక కార్యక్రమాలు పాత్ర చాలా అవసరమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , రాష్ట్ర పర్యాటక, భాషాసాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు.

బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రం ఆడిటోరియంలో ఎంతో వైభవంగా నిర్వహించిన రెండవ రోజు జగననన్న స్వర్ణత్సవ సాంస్కృతిక సంబరాల ఉత్సవాలను మంత్రి రోజా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీయం, దేవాదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ హాజరు కాగా, జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోష్, పార్లమెంట్ సభ్యులు వంగా గీత, మార్గాని భరత్ రామ్, రుడా చైర్ పర్సన్ షర్మిళా రెడ్డి, శాసనసభ్యులు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ వంగపండు ఉష, స్థానిక ప్రజాప్రతినిధులు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి , రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను మరింత ఇనుమడింపచ చేసే విధంగా నేడు సాంస్కృతిక పట్టణమైన రాజమహేంద్రవరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లుగా విభజించి కళాకారులను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడం అనేది చక్కని కార్యక్రమన్నారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఒక కళాకారిణిగా తన నటనా కౌసల్యంతో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న మంత్రి రోజా వంటి మహిళలు అరుదుగా ఉంటారన్నారు. సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న కళారూపాల్లో టాలెంట్ ఉన్నవారిని ఎటువంటి పక్షపాతం ఎంపిక చేయడం సముచితమన్నారు. పేదరికం, ధనిక అనే భావనలేకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్న సంకల్పంతో నాడు నేడు ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కార్పోరేట్ స్థాయిలో పాఠశాలలను ఆధునీకరిస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యాను పిల్లలకు అందిస్తున్నారన్నారు. ఇంత చేస్తున్న యువ నేత జగనన్న 50 వ పుట్టిన రోజును వేడుకలా జరుపుకోవాలన్నారు.

రాష్ట్ర పర్యాటక, భాషాసాంస్కృతి శాఖ మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కళాకారులు వారి ప్రతిభను మనందరికి చూపించి కాంపిటేషన్ లో గెలుపొందాలని ముందుగా వారిందరికి అందిరికీ శుభాకాంక్షలు తెలుపు తున్నానన్నారు. మన కళలు అంతరించి పోకుండా నిక్షిప్తం చేసేందుకు ఇటు వంటి సంబరాలు ద్వారా రికార్డు చేసి డ్యాక్యుమెంట్ రూపంలో డేటాను ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు. కళాకారులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలతో పాటు కళారంగాన్ని అభివృద్ది చేసే క్రమంలో వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం కళాకారులను అండగా ఉంటుందనడానికి ఈ ఉత్సవాల ప్రదర్శన నిదర్శనం అన్నారు. ఈ సంబరాలు నాలుగు జోన్లలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు రాష్ట్రస్థాయిలో అవకాశం ఉంటుందన్నారు. జోనల్ స్థాయిలో చక్కని ప్రతిభ కనబరచిన వారికి భవిష్యత్తులో వారి జీవనోపాధికి ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. జిల్లాల్లో క్రీడా సంబరాలు జరుగుతున్నాయని జోనల్ స్థాయిలో విజేతలకు పైనల్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజున జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లాలో క్రీడలు అభివృద్ది పరిచేందుకు గ్రామ, వార్డు స్థాయి స్పోర్ట్సు క్లబ్ ను ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రం కోసం దేశం ఆడాలనుకున్న వారందరికి కోచింగ్ ఇస్తామన్నారు. క్రీడలు ఆరోగ్యం తోపాటు చక్కని ఉద్యోగావకాసాలు వచ్చేందుకు అవకాసం ఉంది. తాను మంత్రిగా అయిన తరువాత ముగ్గురికి గ్రూప్ ఒన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. తల్లితండ్రలు పిల్లలను చదువుతో పాటు స్పోర్ట్సు, సాంస్కృతిక కార్యాక్రమాలు నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుకుతారన్నారు. నేడు ముఖ్యమంత్రి జగనన్న 694 కోట్ల రూపాయలు 11 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెనగా అందిచారన్నారు. ప్రపంచ దేశాల్లో పెద్ద సంపద 50 శాతం యువత భారత దేశంలో ఉందన్నారు. పిల్లలే మన ఆస్తి పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దితే రాష్ట్రం మంచి అభివృద్ది చెందుతుదన్నారు. ముఖ్యమంత్రి నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ది పరుస్తు విద్యాదీవెన, వసతిదీవేన తో విద్యాభివృద్దికి కృషి చేస్తూ పిల్లలకు ఒక మామయ్యగా, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా, అన్నలా నేనువిన్నాను.. నేను ఉన్నాను. అంటూ ఇచ్చిన వాగ్దానాలను నిజం చేసారన్నారు. అటువంటి మంచి మనస్సున్ననాయకుడు జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజున సంఘీభావం తెలియజేయడం సముచితమన్నారు.

జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నా మన్నారు. ఇంత మంచి కల్చర్, కళలు గ్రామాల్లోనే ఉన్నాయని నేటి యువతరానికి తెలియదన్నారు. కళాకారుల ద్వారా కళా ప్రదర్శనలను ముందుకు తీసుకువెలుతూ భావితరాలకు తెలిచే విధంగా రూపొందిస్తున్నరాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లో చురుగ్గా పాల్గొని వారి ప్రతిభను వెలికితీయాలన్నారు. రాజమహేంద్రవరం వేదికగా తూర్పు, పశ్చిమ లను జోన్ గా తీసుకొని ఇటువంటి సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం శుభపరిణామమన్నారు.

సభాధ్యక్షలు స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా రాష్ట్ర మంతా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో ఎంతో మంతి ప్రతిభ కళాకాలు పాల్గొన్నరన్నారు. కల్చర్ తో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. నగరంలో ఇటీవలి ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ స్టేడియంను మంత్రి రోజా శంఖుస్తాపన చేశారన్నారు.

పార్లమెంట్ సభ్యులు వంగా గీత మాట్లాడుతూ కళాకారులు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా కళలను ప్రదర్శిస్తూ ఆదరిస్తునే ఉంటారన్నారు. రాష్ట్రమంతా జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గోన్న కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు చక్కగా చదువుకుని ఏ ప్రాంతానికి వెళ్లినా తమ ప్రతిభతో ఎదుర్కొనే విధంగా ఉండాలన్నారు.

రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోష్ మాట్లాడుతూ కవులు, కళాకారులు, సాహీతీ వేత్తలకు నిలయమైన రాజమహేంద్రవరంలో ఇంత చక్కటి సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంతరించి పోతున్న కళారూపాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయ మన్నారు. స్వతహాగా కళాకారిణి అయిన మంత్రి రోజా ఇటువంచి చక్కని కార్యక్రమాలు చేపట్టడం మంచి నిర్ణయమన్నారు.

రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ సాంస్కృతి నగరమైన రాజమహేంద్రవరంలో మూడు రోజులు పాటు సాంస్కృతిక సంబరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులు మరింత గుర్తింపు పొందుతారన్నారు.

గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కళాకారులను ప్రోత్సహిస్తుందన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీసీయం, దేవాదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోష్, పార్లమెంట్ సభ్యులు వంగా గీత, మార్గాని భరత్ రామ్, రుడా చైర్ పర్సన్ షర్మిళా రెడ్డి, శాసనసభ్యులు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, సాంస్కృతి కశాఖ చైర్ పర్సన్ వంగపండు ఉష, స్థానిక ప్రజాప్రతినిధులు అడపా శ్రీహరి తదితరులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకులు మల్లిఖార్జునరావు, సంగీత కళాశాల ప్రిన్స్ పాల్ యం. కృష్ణమోహన్, నాట్యాచారుడు పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *