Breaking News

ఆన్‌లైన్‌ టెండర్‌లో పాల్గొనడంపై కాంట్రాక్టర్లకు అవగాహన సదస్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఆహార సంస్థ, ప్రాంతీయ కార్యాలయం, విజయవాడనందు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా నవంబర్‌ 30న గవర్నమెంట్‌ ఇ`మార్కెట్‌ ప్లేస్‌ (జెమ్‌)లో ఆన్‌లైన్‌ టెండర్‌లో పాల్గొనడంపై కాంట్రాక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఎఫ్‌సిఐ గోదాములలో ఆధునిక యంత్ర పరికరాలు ఉపయోగించి లోడిరగ్‌, అన్‌లోడిరగ్‌ చేయడం మరియు బిల్‌ ట్రాకింగ్‌ సిస్టం ద్వారా పారదర్శకమైన మరియు వేగవంతమైన చెల్లింపులు విధానం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఆహార సంస్ధ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ జోషి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డీజీఎంలు జయప్రసాద్‌, అజయ్‌కుమార్‌ భక్త, ఏజిఎం శ్రీనివాసరావు మైలపల్లి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *