– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-మల్లాది విష్ణు చేతులమీదుగా శాప్ చెస్ లీగ్ బ్రోచర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 4న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు జరుగు చెస్ లీగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని చెస్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు చదరంగం ఆడారు. మేథోశక్తిని పెంపొందించే గొప్ప క్రీడ చందరంగం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి చదరంగం నేర్చుకోవడం వల్ల చిన్నారులు చురుగ్గా తయారవుతారన్నారు. కార్యక్రమానికి తప్పక హాజరవుతానని తెలియజేశారు. అనంతరం మల్లాది విష్ణు చేతులమీదుగా బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉమ్మడి కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రాజీవ్., జిల్లా ఆర్బిటర్ ఎన్.సాహితి ఉన్నారు.