తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల కోసం, కార్మిక కర్షకుల కోసం తెనాలి డివిజన్లో జీవితాంతం నిరంతర కృషి చేసిన మహోన్నతుడు జి.వి.కృష్ణారావు అని ఎఐటియుసి తెనాలి అధ్యక్షులు గురుబ్రహ్మం చెప్పారు. తెనాలి సిపిఐ కార్యాలయంలో ఎఐటియుసి తెనాలి ఏరియా ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ప్రజా నాయకుడు జి. వి. కృష్ణారావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు ఎఐటియుసి మాజీ అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. యస్ గురుబ్రహ్మం తన ప్రసంగంలో తెనాలి ప్రాంతంలో జి.వి.కృష్ణారావు ఎఐటియుసి రాష్ట్ర నాయకునిగా, జిల్లా సిపిఐ కార్యదర్శిగా, అన్ని ప్రజా సంఘాల వారిని కలసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారన్నారు. తెనాలి మిల్లు ఓనర్సు కూడా కృష్ణారావు సలహాలు తీసుకుని కార్మికులు జీతభత్యాలను పెంపుదల చేసేవారన్నారు. అసంఘటిత కార్మికులను ఐక్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జి. వి. కృష్ణారావు స్పూర్తితో నేటి యువతరం ప్రజల కోసం పనిచేసే నాయకులుగా ఎదగాలన్నారు.
అధ్యక్షత వహించిన బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ రేయనక వగలనకా ఏక్షణంలో కార్మికుల సమస్యలున్నా జి.వి.కె. పాల్గొనేవారని చెప్పారు. ఆయన రాకతో వేల సంఖ్యలో కార్మికులు పాల్గొనేవారన్నారు. తెనాలి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ పేద ప్రజలతో పాటు కార్మిక వర్గ సంక్షేమానికి నిరంతరం శ్రమించిన అమరజీవి జి.వి.కృష్ణారావు అని చెప్పారు. కృష్ణారావు అందరితో కలుపుగోలుగా ఉండేవారని ఆయన జీవిత విశేషాలను వివరించారు. పోస్టల్ నాయకులు యు. సత్యనారాయణ మాట్లాడుతూ జి. వి. కృష్ణారావు స్ఫూర్తితో ఎఐటియుసిని బలోపేతం చేయాలన్నారు.
ఏఐటియుసి నాయకులు మునిపల్లి. శ్రీకాంత్ మాట్లాడుతూ. | జి.వి.కె. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులను ఐక్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సభ మౌనము పాటించి జోహార్లు పలికారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గాయకులు విప్లవగేయలను ఆలపించారు కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు జె.వి.యస్ రాంబాబు, జి వెంకటేశ్వరావు కె మహేష్, కె సురేష్ బాబు, కె సత్యశివరావం, సుధాకర్, కె ప్రవీణ్ కుమార్ ,యస్ అనిల్ కుమార్, జె. శ్రీధర్ ,డప్పుల దళం అధ్యక్షులు రవి వెంకయ్య, కొరియోగ్రాఫర్ శశికరణ్, ఏఐటీయూసీ పోస్టల్ శాఖ నాయకులు యు సత్యనారాయణ, ఏ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.