Breaking News

తూర్పు గోదావరి జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా ఎన్. తేజ్ భరత్ శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ ఉదయం పదవి భాద్యతలను స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను జేసీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కి అభినందనలు తెలిపారు. జిల్లా కొత్తగా ఏర్పడి ఏడు నెలలు కాలం లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పరిపాలనను గాడిలో పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ వేగవంతం అవుతున్న దృష్ట్యా మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ జిల్లాలో అందరి అధికారులతో, ప్రజా ప్రతినిధులతో అన్ని వర్గాలతో సమన్వయం సాధించడం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ను పూర్తి చెయ్యడం లో జిల్లా కలెక్టర్ వారి సూచనలు మేరకు పనిచేస్తామని తెలిపారు. తొలుత ఏలూరు ఆర్డీవో గా గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అయ్యానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా అసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్ గా, సి సి ఎల్ ఏ లో సి ఎం ఆర్ ఓ గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వద్ద ఎగ్జీక్యూటివ్ అసిస్టెంట్ గా పలు పదవుల్లో పనిచేయ్యాడం జరిగింది. జాయింట్ కలెక్టర్ కు అభినందన లు తెలిపిన వారిలో డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఎస్. మల్లి బాబు, డి ఎస్వో పి. ప్రసాద రావు, కలెక్టరేట్ ఏ వో జీ. భిమారావు, డి ఎం (సీఎస్) ఆర్.తనూజా, పలువురు జిల్లా అధికారులు, బ్యాంకర్లు, రెవెన్యూ అసోసియేషన్ , వి ఆర్ వో, వి ఆర్ ఎ అసోసియేషన్ సభ్యులు, కలిసి అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *