Breaking News

నిరుపేదల పాలిట ప్రాణదాత

-తన కుమారుడిని బ్రతికించాలంటూ ముఖ్యమంత్రికి తల్లిదండ్రుల వినతి*
-తానున్నానంటూ సీఎం భరోసా –
-ఎంత ఖర్చయినా తామే భరిస్తామని హామి
-వెంటనే వైద్యం చేయించాలంటూ అధికారులకు ఆదేశం

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని … మీరు నిశ్చితంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చిన ఘటన శుక్రవారం సీఎం స్వంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది . ఈ సన్నివేశం బిడ్డ తల్లిదండ్రుల కంట ఆనందబాష్పాలు తెప్పించగా , సీఎం తక్షణ స్పందనకు అక్కడున్న ప్రజాప్రతినిధులు , అధికారుల మనసులు ద్రవించాయి . వివరాల్లోకి వెళితే … అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర రెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది . చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు . వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు . ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు . లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు . పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని స్థితి . ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని వెంకట్రామిరెడ్డిని కలిశారు . ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు . దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు . వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని , మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు . తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు . దీంతో దివాకర్రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు . అక్కడున్న అధికారులు , ప్రజాప్రతినిధులు సీఎం తక్షణ స్పందనకు చలించిపోయారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *