విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని మాత్రమే చూడాలని, ఆలాకాకుండా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూడదు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ , 8వ సచివాలయం పరిధిలోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో నాయకులతో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు అని అన్నారు. ఈ మూడేళ్ళ కాలంలో ప్రభుత్వ నిధులతో ఈ ప్రాంతంలో రోడ్లు, పార్కులు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ ను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తరువాత మరలా ఇప్పుడే ఈ ప్రాంతంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని ఇక్కడి పెద్దలు చెబుతున్నారు అని అన్నారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలు విసుగుచెందారు అన్నట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని, రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టే నిన్న స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తే ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారంటేనే అర్థం అవుతుంది ప్రజల గుండెల్లో అవి ఎంతగా నిలిచి ఉన్నాయని అన్నారు. ప్రజలు కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని మరలా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని అవినాష్ కోరారు.
బీటీ రోడ్డు కు శంకుస్థాపన
తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్ దీప్తి భవన్ పక్కన 9లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే బీటీ రోడ్డు కు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ ప్రాంతంలో రోడ్లు వేయడం జరిగిందని, ఈ రోడ్ ను కూడా వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి, డిప్యూటీ మేయర్ బెల్లం, దుర్గ, వెంకటేశ్వరరావు, ఈదర వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, పాలడుగు శంకర్రావు, వీరమచినేని వెంకటేశ్వర రావు, హనుమంతరావు, నాయుడు, గొట్టం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.