విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బి.జె.పి. మాటిమాటికీ వారసత్వ రాజకీయాలను ద్వేషిస్తుంది. బి.జె.పి.లో సమర్థులైన వారసులు లేరు కాబట్టి ఇలా అంటుందని రాజకీయ వ్యూహకర్త తాత సుబ్రమణ్యం అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తాత సుబ్రమణ్యం మాట్లాడుతూ సమర్థులైన వారసులుంటే దేశానికి, రాష్ట్రానికి మంచిదేనని అన్నారు. రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ ప్రజా జీవితంలో వున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో నారా చంద్రబాబు నాయుడు అబ్బాయి నారా లోకేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా ఎప్పుడూ ప్రజల మధ్యన వున్నారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు వై.యస్. జగన్మోహన్రెడ్డి సి.ఎమ్. గా రాణిస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు కె.టి.ఆర్. మంత్రిగా కొనసాగుతున్నారు. వీళ్ళందరూ తండ్రులకు తగ్గ తనయులుగా సమర్థులైన వారసులుగా విజయవంతంగా రాణిస్తున్నారు. ఇకనుంచైనా బి.జె.పి. తన స్టాండ్ను మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. ఆహ్లాదకరమైన రాజకీయాలకు సమాజంపై, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యూహకర్తలు అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …