-నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
-క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిస్వా భూషణ్ హరి చందన్ ఆహ్వానం మేరకు ది.04.12.2022 తేదిన గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రాజ్ భవన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతి సందర్శించే రహాదారులు రోడ్ల ఏర్పాట్ల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేసించినారు. బెంజి సర్కిల్ దగ్గర ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
తదుపరి జాతీయ రహదారి రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు కారిడార్ నిర్మాణo జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పరిశీలించారు. కారిడార్ పనులను వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగితెలుసుకొని పలు సూచనలు ఇచ్చినారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు శానిటరీ సెక్రటరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.