Breaking News

అర్హులను ఓటర్లుగా చేర్పించాలి, అధికారులకు పలు ఆదేశాలు…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్.ఎస్.ఆర్-2023 లో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక సమ్మేళనం 03.12.2022 న జరిగింది. విజయవాడ గవర్నర్ పేటలోని సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ లోని 231 నుంచి 235 (5 పోలింగ్ స్టేషన్లు) పోలింగ్ బూత్ లను ఎన్నికల నమోదు అధికారి-80, సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం, మున్సిపల్ కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ఏఈఆర్వో, తహశీల్దార్, సెంట్రల్ ఎలక్షన్ సెల్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్, సెంట్రల్ ఎలక్షన్ సెల్ తో కలిసి సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ స్టేషన్ నెంబర్ తప్పని సరిగా చూపించాలని, ప్రతి బి. యల్. ఓ వారికి సంబందించిన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల రేషియోని తప్పినసరిగా తెలుసుకోవాలని, లొకేషన్ మ్యాప్ ని తప్పనిసరిగా వారివద్ద ఉండవలెనని, ప్రతి బూత్ లెవల్ అధికారికి 50 మంది కొత్త ఓటర్లను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 18-19 సంవత్సరముల వయస్సు వారిని కొత్త వోటర్లుగా నమోదు చేయవలసినదిగా సూచించారు. అర్హత తేదీ 1.1.2023 నాటికి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నందు అవసరమైన సవరణలు చేయుటకు ఎలక్షన్ కమీషను వారు కల్పించిన ఈ సదుపాయమును ప్రజలు తప్పక వినియోగించుకొనవలసినది. ఒక పరిపూర్ణమైన ఓటర్ల జాబితా ను తయారు చేయుటకు గాను ఎలక్షన్ కమీషను వారిచే ఏర్పాటు చేయబడిన ఈ ప్రక్రియలో భాగంగా పౌరులందరూ SSR 2023 నందు తప్పక పాల్గొనవలసినదిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *