Breaking News

విభిన్న ప్రతిభావంతులు చట్టాలపై అవగాహన కలిగి ఉండి హక్కులను తెలుసుకోవాలి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభవంతులకు ప్రభుత్వం కల్పించిన చట్టాలు హక్కులపై అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లా వయోవృద్దులు, హిజ్రాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాకేత్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, హక్కులకై భారత ప్రభుత్వ వికలాంగుల హక్కుల చట్టం 2016 రూపొందించిందన్నారు. ఈ చట్టంపై విభిన్న ప్రతిభావంతులు అవగాహన కల్పించుకుని హక్కులను సాధించుకోవాలి అన్నారు. సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలో విభిన్న ప్రతి భావంతులపై వివక్షతతో నిర్లక్ష్యం చేస్తే సెక్షన్‌ 92 ప్రకారం కేసులను నమోదు చేయవచ్చునన్నారు. విభిన్న ప్రతిభాంతులను అదరించే సంస్థలను గౌరవించాలన్నారు. విద్యా,ఉపాధి, ఉపకారణాల పంపిణీలో ముందంజలో ఉన్నప్పటికి వారి పట్ల ఇంకను మెరుగైన వాతావరణం కల్పించాల్సిన అవసరం వుందన్నారు. సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిజబుల్టీకి సంబంధించిన ధృవ పత్రాలను 30 రోజుల్లో అందించవలసి ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులు సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. రేషన్‌కార్డులు, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియకు సంబంధించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ప్రతిభతో రాణిస్తూ ప్రతిభావంతులుగా పేరును సార్థకం చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం మాననీయ కోణంలో ఆలోచించి విభిన్న ప్రతిభావంతులపై ప్రత్యేక దృష్టి పెట్టి పెన్షన్లు, ట్రై సెక్రిళ్ళు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉపకరణాలను అందజేయడంతో పాటు అర్హులైన వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నామని శాసనసభ్యులు అన్నారు.
విభిన్న ప్రతిభవంతుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి. రవి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు విద్య, వైద్య, ఉపాధి వంటి వాటిలో రాణించే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల మంది విభిన్న ప్రతిభావంతులకు గృహాలను మంజూరు చేయడంతో పాటు, 6 వేల మంది విద్యార్థులకు 12 కోట్ల రూపాయల ఉపకార వేతనాలను అందించామన్నారు.
విభిన్న ప్రతిభవంతుల సంక్షేమ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం ఎ. కమార్‌ రాజా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించి వారు స్వయం శక్తితో వ్యాపారాలు నిర్వహించుకునేలా బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 మూడు చక్రాల వాహనాలు మంజూరు చేశామన్నారు.
కార్యక్రమంలో వివిధ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతులకు 8 ల్యాప్‌టాప్‌లను అందజేశారు. తొలుత విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహం, మెడోన్నా మూగ బదిరల కళాశాల, మానసిక వికాస కేంద్రం, కెడిపి ట్రస్ట్‌, ప్రేమ వికాస్‌, ప్రేమ్‌ నికేతన్‌, విజయ మేరీ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌లకు చెందిన విభిన్న ప్రతిభవంతుల చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అకట్టుకున్నాయి.
కార్యక్రమంలో బ్లైండ్‌ విభాగ అసోసిమేషన్‌ అధ్యక్షులు స్వామి, రాష్ట్ర ప్రతినిధి కిరణ్‌, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి బి రామ్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *