Breaking News

రైతులకు మేలు చేకూర్చేలాగా నూతన మార్గదర్శకాలు

-పూర్తిగా ఆన్లైన్ ద్వారా నే ధాన్యం కొనుగోళ్లు…
-జేసీ తేజ్ భరత్

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
పురుషోత్తమ పట్నం ఆర్భికే సందర్శన యొక్క ఉద్దేశ్యం రైతుల నుండి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడం కోసం రావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం సీతానగరం మండలం పురుషోత్తమపట్నం అర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, రైతులతో ముఖా ముఖి సంభాషించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ విలేఖరులతో మాట్లాడుతూ, సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలాల్లో ఖరీఫ్ సీజన్ ధాన్యం కోతలు ప్రారంభం అయ్యాయని ఆ నేపథ్యంలో రైతుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు, వారి సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి అధికారులు తో రావడం జరిగిందన్నారు. ఆరుగాలం కష్టపడి పని చేసే రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అంద చెయ్యలనే ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియలో నూతన మార్గదర్శకాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. నూతన విధానంలో కొన్ని సమస్యలు ఎదురవ్వడం సహజమని, వాటికి నేరుగా రైతులతో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రైతులు ప్రధానంగా మూడు సమస్యలు తమ దృష్టికి తీసుకుని రావడం జరిగిందన్నారు. గన్ని బ్యాగులు – ఇందుకోసం గ్రామ వ్యవసాయ సహాయకులు అర్భికే కు ఈరోజు ఏ రైతు ఎంత ధాన్యం తీసుకుని వస్తారో అంచనా వెయ్యడం వల్ల 24 గంటల ముందే ఆమేరకు గన్ని బ్యాగులు సిద్దం చేస్తామని జేసీ భరత్ తెలిపారు. మిల్లర్లు కూడా ఈ విషయంలో సానుకూలత వ్యక్తం చేశారని అన్నారు. రెండో అంశం రవాణా .. రైతు స్వంతంగా వాహనాన్ని సమకూర్చుకున్న లేదా రవాణా శాఖ ద్వారా సమకూర్చిన లేదా ప్యాక్ సొసైటీ ద్వారా రవాణా వాహనాన్ని సమకూర్చడం జరుగుతుందని, ప్యాక్ ఈ విషయంలో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామన్నరు. ప్రభుత్వం నిర్దేశించిన ధర మేరకు మాత్రమే చెల్లింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి పూర్తిగా ధాన్యం సేకరణ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే చేపడుతున్నట్లు తెలిపారు.  మూడో అంశం తేమ శాతం అన్నారు. ఒక్కసారి అర్భికే కొనుగోలు కేంద్రం వద్ద తేమ శాతం నిర్ధారణ ఐతే ఆ మేరకు మాత్రమే చెల్లింపులు జరుపుతామని, మిల్లర్లు తేమ శాతం ఎక్కువగా ఉందని తిరస్కరించాడానికి అవకాశం లేదని, ఈ విషయంలో మిల్లర్లు కూడా అంగీకారం తెలపడం జరిగినట్లు జెసి భరత్ పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2.85 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.23 లక్షల మెట్రిక్ టన్నులుగా రివైజ్డ్ చెయ్యటం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 1.53 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామని, మార్చి వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణ చెయ్యవచ్చునని, దాదాపు ఈనెలాఖరు నాటికి లక్ష్యాలను పూర్తి చేస్తామని అన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు,  డి ఎం (సి ఎస్) ఆర్. తనూజ, డి ఎస్ వో  పి. ప్రసాదరావు, డి సి ఓ ఎమ్. జనార్ధన రెడ్డి, అర్భికే, కొనుగోలు కేంద్రం సిబ్బంది, రైతులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *