రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో అందచేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అభినందించారు. శనివారం రాజమహేంద్రవరం తోర్రెడు గ్రామం లో హౌసింగ్ లే అవుట్ లో వెంకటలక్ష్మి అనే లబ్దిదారుని ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఎంతో విలువైన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ద్వారా సొంత ఇళ్లు లేని పేద వారి సొంత ఇంటి కల సాకారం చేస్తున్నట్లు తెలిపారు.. ఇప్పటికే ఇంటి నిర్మాణం చేపట్టి మరికొందరికి ఆదర్శంగా నిలిచిన లబ్ధిదారులను ఆయన అభినందించారు.
జేసీ వెంట ఎంపీడీఓ కె. రత్న కుమారి, సచివాలయం సిబ్బంది, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …