విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుభమస్తు షాపింగ్ మాల్ ఆధునికీరించి సరిక్రొత్త రూపంతో మెరుగైన షాపింగ్ కోసం సిని నటి హెబ్బాపటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజి రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్‌లో శనివారం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో సిని నటి హెబ్బాపటేల్ మాట్లాడుతూ అన్ని రకాలైన శారీస్, దుస్తులు వివిధ రకాలైన మోడల్స్‌లో అతి తక్కువ ధరతో ప్రత్యేక ఆఫర్‌తో అందజేస్తున్నారని, అంతే కాకుండా ప్రత్యేక బహుమతులను కూడా కస్టమర్లకు ఏర్పాటు చేశారన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండగలను పురస్కరించుకుని అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకొని, లక్కీడ్రాలో స్కూటర్లు, కార్లు బహుమతిగా పొందాలని కోరారు. నిర్వాహకులు బయ్యా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్, క్రిస్మస్, సంక్రాంతి పండగలను పురస్కరించుకుని క్రింద 1+1 ఆఫర్‌తోపాటు, ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై డ్రా కూపన్ ఏర్పాటు చేశామని వాటిద్వారా లక్కీడ్రాలో గెలుపొందిన వారికి 2 పండుగలకు రెండు కార్లు 44 ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తున్నామన్నారు. ఈరోజు నుంచి జనవరి 15వ తేదీ వరకు రోజూ డ్రా తీయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 25, జనవరి 15న బంపర్ డ్రా తీసి కారు బహుమతిగా ఇస్తామన్నారు. తమ షాపింగ్ మాల్‌లో శారీస్, మెన్/బోయ్స్, ఉమెన్/గర్ల్స్ వివిధ రకాలైన శారీస్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్స్, బిగ్‌సైజ్ టవల్స్, డోర్ కర్టన్స్, డబుల్‌కాట్ ఎ/సి బ్లాంకెట్స్ తదితర రకాలైన ఐటమ్స్‌ను డైరెక్ట్‌గా మిల్లు, ఫ్యాక్టరీ ధరలకే అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగరవాసులు వస్త్రాభిమానులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయ్యా శైలజ, రాణా ప్రతాప్ సిబ్బంది, భారీ సంఖ్యలో కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …