విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, అయ్యప్పనగర్ నందు,శాంతి రోడ్ లో నూతనంగా నిర్మించబోయే రాష్ట్ర నూతన అగ్ని (వన్నియ) కుల సంక్షేమ భవన్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన లో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథి గా పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అగ్ని కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ భవన నిర్మాణం కోసం సంక్షేమ సంఘం వారు 25లక్షలు సమకూర్చుకోగా,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు తన ఎంపీ ల్యాండ్స్ నుండి 25లక్షలు మంజూరు చేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణం పూర్తి అయ్యేవరకు సంపూర్ణ సహకారం ఉంటుందని అవినాష్ వారికి భరోసా ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం కూడా కుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని,రాజకీయ గుర్తింపు ఇచ్చేలా అనేక పదవులు ఇచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్నియ కుల కార్పొరేషన్ డైరెక్టర్ ఒడుగు గోపీనాధ్ వర్మ,స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్,రిజ్వాన్,ధనికుల కాళీ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …