Breaking News

బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకులు సీఎం వైఎస్ జగన్‌

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా ‘జయహో బీసీ’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవం నిలబెట్టారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ‘జయహో బీసీ’ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గత మూడున్నర ఏళ్లలో అక్షరాల రూ. 86 వేల కోట్ల సంక్షేమాన్ని డీబీటీ రూపంలో అందించినట్లు వివరించారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు పరిపాలనలో భాగస్వామ్యం చేశారని వెల్లడించారు. ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక అందులోని ప్రతిఒక్క అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేసిందని వివరించారు. బీసీల్లోని 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 672 మంది డైరక్టర్లను నియమించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కేబినెట్ లో 11 మంది బీసీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారని చెప్పారు.

ప్రతి అడుగులోనూ బీసీల వెన్నంటే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతిఒక్క అడుగులోనూ బీసీలు భాగస్వాములై ఉన్నారని మల్లాది విష్ణు అన్నారు. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు బీసీలను నిలువునా ముంచారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమన్నందుకు.. తోకలు కత్తిరిస్తానంటూ గతంలో బెదిరించారని గుర్తు చేశారు. చంద్రబాబుకి బీసీలపై ప్రేమంతా మాటలకే పరిమితమని.. కానీ చేతల్లో చూపిన నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి, సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నారని చెప్పుకొచ్చారు. గడిచిన మూడున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలును చెప్పడంతో పాటు.. భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నామో ఈ నెల 7న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగననున్న సభలో చర్చిస్తామన్నారు. 83 వేల మంది బీసీ ప్రతినిధులతో జరిగే ఈ మహాసభలో ప్రతి డివిజన్ నుంచి కనీసం 300 మంది ఊరేగింపుగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఎండి షాహినా సుల్తానా, కొంగితల లక్ష్మిపతి, ఉమ్మడి రమాదేవి, మోదుగుల తిరుపతమ్మ, పెనుమత్స శిరీష, శర్వాణి మూర్తి, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, హఫిజుల్లా, అలంపూర్ విజయ్, బత్తుల దుర్గారావు, కనపర్తి కొండా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *