విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఇంధిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టేడియంకు చేరుకునే మార్గంలో కారులో నుంచి తన్నీరు లక్ష్మణ్‌రావు కుటుంబాన్ని చూసి చలించి తక్షణమే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావును ఆదేశించారు. జి. కొండూరు మండలం చెవుటూరుగ్రామనికి చెందిన తన్నీరు లక్ష్మణ్‌రావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉంటూ వైద్యం అందించడంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆసమయంలో కాన్వాయ్ నుండి వారిని గమనించిన ముఖ్యమంత్రి అధికారుల ద్వారా వివరాలను తెలుసుకుని తక్షణమే ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును లక్ష్మణ్‌రావు కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తన్నీరు లక్ష్మణ్‌రావుకు మెరుగైన వైద్య ఖర్చుల కింద జిల్లా కలెక్టర్ డిల్లీరావు తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయల చెక్కును నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మణ్‌రావు కుటుంభ సభ్యులకు అందజేశారు. బాధితుడు లక్ష్మణ్‌రావుకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు కలెక్టర్ డిల్లీరావు హామీ ఇచ్చారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …