-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఉపాద్యాయులు, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధ్యాన్యమిస్తామని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. ది: 4-12-2022 తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలక వర్గనికి జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ కు ఘన విజయము సాధించిన విషయం తెలిసిందే. సొసైటీ అధ్యక్షుడు గుంజా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ని మర్యాదపూర్వంగా కలిశారు. ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ మ్యానిఫెస్టో ను అమలు పర్చడంలో వీ.ఎం.సీ సహాయ సహకారము అందించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు మంచి చేయిటకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసినారు. అందుకు ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ అభ్యర్ధులు వారికి కృతజ్ఞతలు తెలియజేసియున్నారు. ఈ కార్యాక్రమములో ప్రెసిడెంట్ గుంజా అజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గుర్రం ఆంజనేయులు, సెక్రటరీ తిరుమారెడ్డి బ్రహ్మరెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సింహాద్రి మస్తాన్ రావు, ఇతర డైరెక్టర్లు, వేజెండ్ల ప్రభావతి, భూపతి గోవింద రావు, గుంటక ప్రభాకర రెడ్డి, తోపుల శివ శంకర్, బచ్చు రాజేష్, తాడిశెట్టి నాగరాజు పాల్గొన్నారు.