అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాలపై శుక్రవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ముఖ్మీత్ ఎస్.భాటియా (Mukhmeet S Bhatia) సమీక్షించారు.ఈసందర్భంగా మైనార్టీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలపై సమీక్షించారు.ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పిఎంజెవికె)అమలు,మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నస్కాలర్ షిప్పు పధకాలు ఫ్రీ మెట్రికి,పోస్టు మెట్రిక్,మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్పులు,బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్ షిప్పులపై సమీక్షించారు.అదే విధంగా మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యాదీవెన,ఓవర్ సీస్ విద్యా స్కీమ్,వైయస్సార్ సాధీతోఫా పధకాలపై కేంద్ర కార్యదర్శి భాటియా సమీక్షించారు.అదే విధంగా ఎపి మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమాలు,వక్ఫ్ బోర్డు కార్యక్రమాలపైన సమీక్షించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర కార్యదర్శి ఎంఎస్.భాటియా సమీక్షించారు.మైనార్టీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలను సక్రమంగా అమలు చేయడం ద్వారా మైనార్టీల అభున్నతికి అన్ని విధాలా కృషి చేయాలని భాటియా అధికారులకు సూచించారు.
ఈసమావేశంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎఎండి ఇంతియాజ్,రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు డా.జిసి.కిషోర్ కుమార్ పాల్గొన్నారు.అలాగే ఆశాఖ అదనపు కార్యదర్శి బి.రోజ్ లతా భాయి,సహాయ కార్యదర్శి టి.శ్రీనివాసులు,ఎపిఎస్ఎంఎఫ్సి విసి అండ్ ఎండి షేక్ షరీన్ బేగం,ఎపిఎస్సిఎంఎఫ్సి ఎండి జె.ఎలీషా,ఎపిఎస్డబ్ల్యుబి సిఇఒ ఎల్.అబ్దుల్ ఖాదర్,ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డా.ఆయూబ్ హుస్సేన్,సిఇడిఎం డైరెక్టర్ షేక్ మస్తాన్ వలీ, ఎపిఎస్ఎన్డిఎఫ్ఎస్ ఎండి డా.మొహమ్మద్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …