-నలుగురికి పౌష్టికాహారం అందించడానికి ముందుకు వచ్చిన సత్య గోవింద్ కు అభినందించిన డిఆర్వో నరసింహులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో టీబీ కోసం చికిత్స పొందుతున్న వారికి బలవర్తమైన ఆహారాన్ని అందించేందుకు “ని-క్షయ్ మిత్ర” గా ద్వారా దత్తత తీసుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “ని-క్షయ్ మిత్ర” కింద నలుగురిని దత్తత తీసుకుకోవడం జరిగింది.
ఈ సంధర్బంగా రూ.16800 లను జిల్లా పశు వైద్య అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్ ఆన్లైన్ ద్వారా “ని-క్షయ్ మిత్ర” బ్యాంకు ఖాతాకు జమ చేశారు. జిల్లాలో క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలన చేసే దిశలో వ్యాధిగ్రస్తులకు పోషక విలువలతో కూడి మంచి పౌష్టకాహారం అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయని డిఆర్వో జీ. నరసింహులు అన్నారు. జిల్లాలో సుమారు 1400 మంది క్షయ గ్రస్త బాధితులు ఉన్నారని వారిలో ఇప్పటి వరకు 378 మందిని 64 మంది నిక్షయ మిత్రులు పేర్లు నమోదు చేసుకుని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , వ్యాపారస్తులు, తదితరులు తమ వంతుగా కనీసం ఒక్కరినైనా దత్తత తీసుకోవాలని కోరారు.
జిల్లా క్షయ నిర్మూలన అధికారి డా ఎన్. వసుంధర వివరాలు తెలుపుతూ, ఇప్పటి వరకు జిల్లాలో 378 మందిని దత్తత తీసుకోగా వారిలో 9 మంది అధికారులు 20 మందిని, గ్రాసం ఇండస్ట్రీ సంస్థ వారు, 104 మందిని, కో కో కోలా కంపెనీ 100 మందిని, ఇతరులు 151 మంది పేషెంట్లను ఇప్పటి వరకు”ని-క్షయ్ మిత్ర” కింద దత్తత తీసుకొని వారికి ఆరు మాసాలకు సరిపడా పౌష్టికాహార కిట్లకు సంబందించి నగదును బ్యాంకు ఖాతాకు జమ చేశారన్నారు. మరో ఇద్దరు అధికారులు ఇద్దరినీ దత్తత తీసుకొవడానికి పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి టీబీ పెషెంట్లకు క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్యులు మందులు అందిస్తున్నారని, వారిలో రోగ నిరోదక శక్తిని పెంచేందుకు పోషకాహరం అందించేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు అభినందనీయం అన్నారు. మరింత మంది ముందుకు వచ్చి జిల్లాను టిబి రహిత జిల్లాగా చేద్దామని విజ్ఞప్తి చేశారు.. బ్యాంకుఖాతావివరాలు ‘DLATO NIKSHAY MITRA EAST GODAVARI ” HDFC ACCOUNT NUMBER 50100559027301 నకు ఒకరిని దత్తత తీసుకోవడానికి ₹.4200/- లను ఆన్లైన్లో జమ చేసి, వారి వివరాలు అధికారులను అందచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్ జి టి సత్య గోవింద్ , డా ఎన్. వసుంధర తదితరులు పాల్గొన్నారు.