విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలు స్థానిక ధర్నా చౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కే . లక్ష్మణరావు మాట్లాడుతూ బీసీలు జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించాలని కుల గణన జరగాలని మేము ఎంత ? మా వాటా ఎంత ? తేల్చాలని డిమాం డ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఉపయోగించుకుంటున్నారని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, బీసీలను, వెనుకబడి ఉన్నారని, ఆయన అన్నారు. జనాభా తమషా ప్రకారం 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తదనంతరం స్టేట్ ఇంచార్జ్ నూకాలమ్మ మాట్లాడుతూ 26 జిల్లాలలో బీసీలు కుల గణన జరగాలని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బీసీలను చైతన్య పరుస్తామని ఆమె అన్నారు. బీసీలకు విదేశీ విద్యా పథకం వల్ల తల్లిదండ్రులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 56 కులాలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఏర్పాటు చేశారని అవి అన్ని నిర్వీర్యం గానే ఉంటున్నాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, జాతీయ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు, ఎం ఏ ఎం ట్రస్ట్ చైర్మన్ మహంతి వాసుదేవరావు, బీసీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …