Breaking News

క్రానిక్‌ కీడ్నీ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధిని వ్యాప్తి చెందకుండా తగుచర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ కొండూరు మండలం తండాలలోని క్రానిక్‌ కీడ్నీ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధిని వ్యాప్తి చెందకుండా తగుచర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ జె.నివాస్‌కు వివరించారు.
ఎ కొండూరు తండాలలోని క్రానిక్‌ కీడ్నీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఇకపై చేపట్టవలసిన పనులపై బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీరాజ్‌, వైద్యాధికారులతో జె.నివాస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి కలెక్టర్‌ డిల్లీరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ తండాలలో కీడ్నీ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఎ కొండూరు మండలంలో డయాలసిస్‌ సెంటర్‌ ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వ్యాధి నిర్థారణ కోరకు ఇంటింట చేపట్టిన బ్లడ్‌ నమూనాల సేకరణ కార్యాక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. మండలంలో రక్షిత నీటి సరఫరా అందించే విధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో పైపు లైన్‌ల నిర్మాణ పనులు పూర్తి చేసి రక్షిత మంచినీటి సరఫరాను సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ డిల్లీరావు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ జె.నివాస్‌కు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌ లో తిరువూరు ఆర్‌డివో యం.రవీంద్రరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా.సుహాసిని, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, పంచాయితీరాజ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *