-ఏ ప్లస్ కన్వెక్షన్ హాల్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిలరాఘరామ్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్న సెమి క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిలరాఘరామ్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. క్రిస్మస్ మాసాన్ని పురస్కరించుకుని క్రీస్టియన్ సోదరి సోదరిమణులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 20వ తేదిన జరిగే తేనేటీ విందులో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. నగరంలోని ఏప్లస్ కన్వెక్షన్ హాల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు పరిశీలించి సెమి క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనే క్రీస్టియస్ మత పెద్దలు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ సలహదారులకు ప్రత్యేక ఆశనాలు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఆహ్వానితులకు ముందుగా ఆహ్వాన పత్రాలు పంపాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరిశీలనలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టి కార్పొరేషన్ యండి జె. ఎలీషా తదితరులు పాల్గొన్నారు.