Breaking News

తడి, పొడి చెత్త సేకరణ పై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాని నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి కోరారు. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్), స్వచ్చ సర్వేక్షణ్ కార్యాక్రమాలు, చెత్త విభజన, స్వచ్చనగరం వంటి పలు అంశాలపై విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించేందుకు వన్ టౌన్, సర్కిల్-1 పరిధిలోని 51వ డివిజన్ నందు శ్రీ ప్రోలు రాజా హై స్కూలు ప్రాంగణంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని (డ్రాయింగ్, వ్యాస రచన పోటీలను) నిర్వహించినారు. ఈ పోటిలలో గెలిచిన వారికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి చేతుల మీదుగా బాగుమతులను అందజేసినారు.

Essay writing

1st prize B.padmaja

2nd prize sk.yasin

3rd prize M Rajeswari

Drawing completion

1st prize G.chandini

2nd prize P.poojasai sri

3rd prize B.jasuwa.

ఈ కార్యక్రమంలో డా.ఇక్బాల్ హుస్సేన్ శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా తడి-పొడి చెత్త, ప్రమాదకర వ్యర్ధాలను వేర్వేరుగా సేకరించేందుకు నగరపాలక సంస్థ అందించిన మూడు రంగుల చెత్త బుట్టలను వినియోగించాలంటూ నగరపాలక అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి అన్నారు. సర్కిల్-3 పరిధిలోని 1,2,3,6,7,9, మరియు 14 వ డివిజన్ల లో గురువారం అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణి చేయడంతోపాటు సీ.ఎన్.జీ ఆటోలకు స్టిక్కర్లను అంటించి ప్రజలకు అవగాహన కల్పించారు. వీక్లీ యాక్టివిటి కింద పై అన్ని డివిజన్ల లో సోర్స్ సెగ్రిగేషన్ కార్యక్రమంలో మూడు చెత్త బుట్టల ద్వారా తడి-పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా నగరపాలక అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వారి ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాలు ప్రకారం క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా ఈనెల 12 డిసెంబర్ 22 నుండి 18 డిసెంబర్ 22 వరకు వారం రోజులపాటు నగరంలో గల 286 సచివాలయ పరిధిలో 64 శానిటరీ డివిజన్లలో గల మూడు లక్షల కుటుంబాలకు మూడు రకాల చెత్త బుట్టలకు సంబందించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటి నుండి వచ్చే చెత్తను వారి ఇంటి వద్దనే తడి పొడి మరియు ప్రమాదకర వ్యర్ధాలను వేర్వేరుగా విభజించి తడి చెత్తను ఆకుపచ్చ బుట్ట, పొడి చెత్తను నీలిరంగు బుట్టలో, ఎరుపు రంగు బుట్టలో ప్రమాదకర వ్యర్ధాలను వేసి నగరపాలక సిబ్బందికి అందజేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వియ్యపు అమర్ నాథ్, మెరకనపల్లి మాధురి, జోనల్ కమిషనర్ డా. ఏ.రవిచంద్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి మరియు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *