-కౌలు రైతుల కుటుంబాలకు భవిష్యత్తుపై నమ్మకం భరోసా కల్పిస్తున్న కౌలు రైతు కుటుంబాల పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్.
-సీఎం జగన్ ది ఐరన్ లెగ్ పాలన.
-జగన్ పాలనలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు.
-రెండు సంవత్సరాలుగా ఖాళీగా కూర్చున్న 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లకు శుభాకాంక్షలు.
-అక్రమ నిర్మాణాలకు విజయవాడ నగరం అడ్డాగా మారింది.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 18 వ తేదీన జరిగే కౌలు రైతుల భరోసా యాత్ర అనంతరమైన జగన్ ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా అని, రాష్ట్రంలో మూడు వేల మంది పైచిలుకు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఈరోజు తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుంటూరులో జరిగే కౌలు రైతుల భరోసా యాత్రకు సంబంధించిన పోస్టర్ను నాయకులతో కలిసి విడుదల చేసినారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి 6 జిల్లాల్లో 500 మందికి పైగా కౌలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించారని, గుంటూరులో జరిగే ఏడవ కౌలు రైతుల భరోసా యాత్రలో మరొక 300 మందికి ఆర్థిక భరోసా అందించనున్నారని, అనంతపురం కర్నూల్ లో 300 పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నందున అక్కడ రెండో విడత భరోసా యాత్ర నిర్వహిస్తారని, రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకునే ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్ అని, ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా రైతుల కుటుంబాల్లో పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుపై భరోసా నమ్మకం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కౌలు రైతుల కుటుంబాల పెద్ద కొడుకు గా కొనియాడుతున్నారని, రాష్ట్రంలో రైతుల కౌలు రైతుల ఆత్మహత్యల లేని రోజు జగన్ పాలనలో లేదని, జగన్ పాలనలో రైతుల జీవితాలు ఉరితాళ్ళకు వేలాడుతున్నాయని, రైతుల పరిస్థితి ఏ విధంగా మారిందంటే చేతికి వచ్చిన పంట నోటి వరకు రావడం లేదని, జగన్ పాలన ఐరన్ లెగ్ లాగా రైతులు పాలిట శాపంలా మారిందని, బటన్ నొక్కడం వల్ల రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య అన్న ఆగిందాని, సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 250 మంది ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఆర్థిక భరోసా కల్పించారని, నేడు సీఎం జగన్ పాలన సాగిస్తున్న గుంటూరు జిల్లాలో 300 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆర్థిక భరోసా అందిస్తున్న పవన్ కళ్యాణ్ పై పనికిమాలిన చౌకబారు విమర్శలు చేయడం ఆపి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడం పై దృష్టి సారించాలని, సత్తెనపల్లి చిన్నోడు బులుగు పార్టీ బ్లూ స్టార్ మంత్రి అంబటి రాంబాబు కు దమ్ముంటే గుంటూరు జిల్లాలో కౌలు రైతుల ఆత్మహత్యలపై మాట్లాడలని, ఎంతమందికి ఏడు లక్షలు నష్టపరిహారం చెల్లించారో సమాధానం చెప్పాలని, రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే ప్రకృతి కూడా రాష్ట్ర ప్రజలను జగన్ కి హాలిడే ప్రకటించమని హెచ్చరిస్తుందని, జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఏ రంగము అభివృద్ధి పథంలోకి వెళ్లలేదని జగన్కు హాలిడే ప్రకటించకపోతే రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని మా పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పదేపదే రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలు తప్పక జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నారు.
రెండు సంవత్సరాలుగా ఖాళీగా కూర్చున్న 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లకు డైరెక్టర్లకు శుభాకాంక్షలు.
56 బీసీ కార్పొరేషన్లు రెండేళ్లుగా జగన్ భజన చేయడం తప్ప బీసీలకు ఉపయోగపడింది ఏమీ లేదు. రెండు సంవత్సరాలుగా కాలక్షేపం చేసిన బిసి కార్పొరేషన్ల చైర్మన్ లకు డైరెక్టర్లకు శుభాకాంక్షలు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీసీలలో ఒక్కరికి కూడా ఒక్క పథకం కూడా ఇప్పించ లేకపోయినా పనికిమాలిన కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లుగా నియమించిన cm జగన్ భజన ఇక ఆపాలని, బీసీలను కేవలం సీఎం జగన్ ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీసీల అభివృద్ధి ఆత్మ గౌరవం రాజ్యాధికారం కోసం నిరంతరం పాటుపడుతున్నారని అందువలన రాష్ట్రంలో ఉన్న బీసీ లందరూ పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలన్నారు.
అక్రమ కట్టడాలకు విజయవాడ నగరం అడ్డాగా మారింది.
అక్రమ కట్టడాలకు బెజవాడ నగరం అడ్డాగా మారిందని, అక్రమ కట్టడాలు యదేచ్చగా చేసుకునేందుకు కొద్ది రోజుల క్రితం మేయర్ భాగ్యలక్ష్మికి బెజవాడ వైసిపి కార్పొరేటర్ల మధ్య డీల్ కుదిరిందని, అక్రమ నిర్మాణాలు చేసుకోండి కానీ 40 శాతం పర్సంటేజ్ ఇవ్వాలని మేయర్ చెప్తున్నారని, ఈ 40 శాతం లో సింహభాగం ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్చార్జికు ఇవ్వాలని చెబుతున్నారని, అధికారులకు, కార్పొరేటర్లకు మేయర్ భాగ్యలక్ష్మి గారు కొమ్ము కాస్తున్నారని,ఎమ్మెల్యే లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాల దందా జరుగుతుందని, విజయవాడ నగర అభివృద్ధికి వైసిపి కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు అడుగడుగున అడ్డుపడుతున్నారని నిజంగా మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ గారికి చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని నగర అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.