-24 గంటలు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి…
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి శుక్రవారం ఉదయం బెంజి సర్కిల్ జంక్షన్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మరియు (శనీశ్వర స్వామి ఆలయం) దగ్గర పారిశుధ్య కార్మికుల యొక్క విధులను పర్యవేక్షించి వారి యొక్క మస్తరు విధానము పరిశీలించారు. బెంజి సర్కిల్ జంక్షన్ లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన ఆధునికీకరణ పనులను పరిశీలించి అక్కడ జరుగుతున్న వాటర్ ఫౌంటైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. తదుపరి భవానీదీక్ష విరమణ సంబంధించి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అదేశించారు. నగరంలో సీతమ్మవారిపాదాలు, శనీశ్వర స్వామి ఆలయం, భవానిపురం పున్నమిఘాట్ పలు స్నానఘాట్లు, కెనాల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన సిబ్బంది తో కలిసి పరిశీలించారు. భవానీదీక్ష విరమణ సంబందించి పారిశుధ్య పనులు నిర్వహించు 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్లు మరియు ఆలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు, క్యూ లైన్ లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సిబ్బంది కి సకాలంలో భోజన ప్యాకెట్ లు అందుతున్నద లేనిది సిబ్బందిని అడిగితెలుసుకొన్నారు. అదే విధంగా మంచినీటి పాయింట్ లను పరిశీలించి నిరంతరం ప్రజలకు త్రాగు నీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పర్యటనలో అర్బన్ డెవలప్మెంట్ ఎం.డి, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి.చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, మరియు ఇతర అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.