-ఫోటో సిమిలర్ ఎంట్రీల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల నుండి స్వీకరించిన ధరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఓటర్ల జాబితాను సిద్దం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫోటో సిమిలర్ ఎంట్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపొందించడంపై జిల్లాలోని రెవెన్యూ అధికారులు శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి 25వ తేది నాటికి అభ్యంతరాలు లేని ఓటర్ జాబితాను సిద్దం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరఖాస్తులను పరిశీలించడంలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. జిల్లాలో సుమారు 68 వేల ఫోటో సిమిలర్ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఒకే ఓటర్ చిత్రంతో పలు చోట్ల బహుళ కార్డులు కలిగిఉన్నట్లు గుర్తిస్తే బూత్ లెవెల్ అధికారులు వాటిని ఎలక్టోరల్ రోరల్స్ సర్వీసెస్ నెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి ప్రస్తుతం ఓటర్ నివాసం ఉంటున్న ప్రాంతంలో మాత్రమే గుర్తుంపు కార్డును ఉండేలా చర్యలు తీసుకుని, మిగిలిన వాటిని తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి స్వీకరించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఫారమ్`6 బి సేకరణ ప్రక్రియను 72 శాతం పూర్తి అయిందని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేయాలని క్లైమ్స్ మరియు అభ్యంతరాల ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 25వ తేది నాటికి జాబితాను సిద్దం చేసేందుకు నివేదికను సమర్పించాలన్నారు. గృహాలు లేని షెల్టార్స్‌లో నివాసం ఉండే వారి పైన, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్ ఓటర్ల పైన ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, ఫారమ్-6 బి, ఓటర్ల నుంచి ఆధార్ వివరాలు సేకరణ, అప్ డేషన్, ఫ్రీ రివిజన్ ఆఫ్ ఎస్‌ఎస్ ఆర్ కార్యాచరణ, పోలిగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ఓటర్ల జాబితా పై యంఎల్‌వోలు బిఎల్‌వోలు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్ కలెక్టర్ అదితి సంగ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, తిరువూరు ఆర్‌డివో వైవి ప్రసన్నలక్ష్మి నందిగామ ఆర్‌డివో ఏ.రవీంద్రరావు, ఎలక్టోరల్ ఆఫీసర్లు ఏ.శ్రీనివాసరావు, జి. శ్రీనివాస్‌రావు, ఉదయబాస్కర్, జిల్లాలోని ఎలక్షన్ డిప్యూటి తహాశీల్థార్లు పాల్గొన్నారు.