-అధికారులకు పలు ఆదేశాలు — కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను మరియు ఐకానిక్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఎక్సెల్ ప్లాంట్ కు ప్రతినిత్యం వచ్చు కొబ్బరిబొండాలు మరియు చెట్ల కొమ్మలను క్రష్ చేసి ప్రాసెస్ చేయుటకు గాను ప్రత్యేకముగా రెండు షెడ్ లను ఏర్పాటు చేయాలని సూచిస్తూ, ప్లాంట్ నందు కొంతమేర అభివృద్ధి పరచిన రోడ్డును పరిశీలించి వాంబె కాలనీ స్మశాన వాటికల వైపు గల గేటు వరకు రోడ్డును వేయాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతములో జరుగుతున్న ఐకానిక్ పార్కు పనులను పరిశీలించి ప్రహరీ గోడ నిర్మాణ పనులను మరియు పార్కు ఆవరణలో చేపట్టిన ప్లాంటేషన్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్లు సత్యనారాయణ రావు, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.