-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,
-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి.
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలిసి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జిలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొని వచ్చిన అర్జీలు అన్నియు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందుల పట్ల అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా , సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం-6, పట్టణ ప్రణాళిక విభాగం – 5, యు.సి.డి – 3, పబ్లిక్ హెల్త్ విభాగం – 1, మరియు అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల,జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.