విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భూముల రీ సర్వే ప్రక్రియకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, తద్వారా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆదేశాల మేరకు సోమవారం గ్రామ సర్వేయర్లకు ప్రాథమిక సౌకర్యాల ఉపకరణాల కిట్లను కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిప్యూటీ కలెక్టర్ జ్యోతి సురేఖ సర్వేయర్లకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 245 మంది గ్రామ సర్వేలకు క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వేకు 2వేల900 రూపాయల విలువ గలిగిన ప్రాథమిక ఉపకరణాల కిట్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వీటిలో సర్వేయర్ కు ఉపయోగపడే లీగల్, ఏ ఫోర్ పేపర్లు, క్యాలిక్యులేటర్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరైజర్లు, ఫోల్డర్లు స్టాంప్యాడ్, పంచింగ్ మిషన్లు, గమ్ బాటిల్స్, ఫైల్ కవర్లు వంటివి ఉంటాయన్నారు. త్వరలో సర్వేయర్లకు మెడికల్ కిట్స్ కూడా పంపిణీ చేయనున్నామన్నారు. జిల్లాకు వారం రోజుల్లో రెండు డ్రోన్లు రానున్నాయని కలెక్టర్ అన్నారు.జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా పథకంలో భాగంగా భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నామని ఇప్పటికే 14 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూ యజమానులకు భూ హక్కు పత్రాల పంపిణీ తుది దశకు చేరుకుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 2023 డిసెంబర్ నాటికి రీ సర్వే ప్రక్రియ జిల్లాలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు రెవెన్యూ, సర్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.సునీత, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …