-ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది..
-స్పందనలో 108 ఆర్జీల నమోదు
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్జీలను స్వీకరించి సంతకం చేసి పంపించడంతో విధి పూరైనట్లు కాదని, ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్న సానుకూల దృక్పదం అధికారులలో ఉన్నప్పుడు స్పందన పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నేరవేర్చి లక్ష్యాన్ని సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ఆర్జీదారుల వినతులకు పరిష్కార మార్గాలను సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో స్వీకరించిన ఆర్జీలపై సంతకం చేసి పై అధికారులకు పంపడంతో విధి పూర్తి అయినట్లు కాదు.. ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించండి.. సానుకూల దృక్పదంతో ఆలోచించండి.. పరిష్కార మార్గం లభిస్తుంది. అప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందన్నారు. పెట్టుకున్న నమ్మకాన్ని నేరవేర్చాలనే లక్ష్యంతో స్పందన ఆర్జీలను స్వీకరించడంలో నూతన వరవడిని తీసుకురావడం జరిగిందన్నారు. శాఖల వారిగా ప్రత్యేక టెబుల్స్ ఏర్పాటు చేసి ఆర్జీదారుడు నేరుగా సంబంధిత శాఖ అధికారులను కలుసుకునే వీలు కల్పించామన్నారు. ఆర్జీదారుడు నుండి స్వీకరించిన ఆర్జీని పరిష్కరించే దిశలో ఆలోచిస్తారన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే ఆర్జీదారుడు నుండి స్వీకరించిన ఆర్జీపై సంతకం చేసి సంబందిత అధికారులకు స్పరించడంతో తమ విధి పూర్తి అయిన్నట్లు అధికారులు భావించరాదన్నారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసాలతో స్పందనలో సమస్య పరిష్కరం అవుతుందన్న ఆశతో వచ్చే ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా ఒర్పుతో సమస్యను విని పరిష్కరించే మార్గంపై వివరించాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను తిరిగి నమోదు కాకుడదన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, 1902 కాల్ సెంటర్, స్పందన మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదయ్యే అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు.
స్పందన కార్యక్రమంలో108 అర్జీల నమోదు అయ్యాయి వీటిలో అత్యధికంగా రెవెన్యూ 39, పోలీస్ 14, యంఏయుడి 9, పంచాయతీరాజ్ 11, గృహ నిర్మాణ శాఖ 4, పౌర సరఫరాలు 5, ఉపాధి కల్పన 2, హెల్త్ 2, విద్య 3, గ్రామ వార్డు సచివాలయం 2, వివిధ శాఖలకు చెందిన 17 ఆర్జీలు నమోదు అయ్యయన్నారు.
స్పందన కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీిడి కె.శ్రీనివాస్, డిఎస్‌వో పి కోమలి పద్మ, డ్వామ పిడి జె. సునీత, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు, డిసివో సిహెచ్ శైలజ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్ నాగమణమ్మ, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.