విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రుతుపవనాలకు ముందుగానే సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్దతులను ఆచరించి భూములను సారవంతం చేసుకునేందుకు రైతులలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు.
రైతు సాధికార సంస్థ ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం (ఏపిసిఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అవసరాలకు మించి రసాయనిక ఎరువులు వినియోగించడంతో భూములలో సారం దెబ్బతిని చౌడు భూములుగా మారుతున్నాయన్నారు. సారవంతమైన భూములలో మాత్రమే రైతులకు ఆశించిన దిగుబడులు లభిస్తాయన్నారు. భూములను సారవంతంగా మార్చుకునేందుకు రుతుపవనాలకు ముందుగా నవధాన్యాల పంటలను నాటడం వలన భూమిలో సారవంతమైన పొర రక్షించబడుతుందన్నారు. ముందుస్తు సేద్యంలో భాగంగా ఘనజీవామృతం వినియోగించడం వలన భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులకు ఆహారం లభించి అవి ఇబ్బడి బ్బుడిగా వృద్ధి చెందుతాయన్నారు. సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందడం ద్వారా పోషకాలను మొక్కల వేర్లకు అందుబాటులో తీసుకువస్తాయన్నారు. తృణధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, వెదచల్లి పంటలను చేపట్టి సూక్ష్మ జీవుల అభివృద్ది చేసుకునేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. సేద్య సన్నద్ద పంటలైన జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలు, పెసలు, శనగలు, మినువులు, నువ్వులు, ఆవాలు, జీలుగ, కట్టె జనుము, పిల్లిపెసర, బెండ, గోరుచిక్కుడు తదితర పంటలను చేపట్టడం వలన నేల కోతను అరికట్టుకోవడం జీవ వైవిద్యం పెరగడం, సూక్ష్మ జీవుల అభివృద్ధి, వర్షపు నీరు భూములలో ఇంకడం, భూతాపం తగ్గడంతో పాటు పశుగ్రాసానికి ఎంతో దోహదపడతాయని రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
కరపత్రాల విడుదలలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగమణెమ్మ, ఏపిసిఎస్ఎఫ్ డిపియం విజయకుమారి, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …