“హీరోస్ ఆన్ రోడ్ “ పేరుతో అవార్డులు ప్రకటించిన ASRTU

-జాతీయ స్థాయిలో సేఫ్టీ అవార్డ్స్ గెలుచుకున్న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.
-ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నుండి ఇద్దరు డ్రైవర్లు ఎంపిక
-డిల్లీలో ASRTU ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ సర్వీసులో యాక్సిడెంట్ చేయని ఉత్తమ డ్రైవర్లకు “హీరోస్ ఆన్ రోడ్” పేరుతో ASRTU (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ ) సంస్థ జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఆర్టీసీల నుండి మొత్తం 42 మంది సేఫ్టీ డ్రైవర్లకు ఈ రోజు అనగా 18. 4. 2023 వ తేదీ సాయంత్రం న్యూ డిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు క్యాష్ అవార్డును అందజేసింది.
మొత్తం 2 కేటగిరీలలో ( సిటీ మరియు మోఫిస్సిల్ ) ఈ అవార్డులు ప్రకటించగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నుండి ఎక్కువ సర్వీసు కాలంలో ప్రమాదాలు చేయని ఇద్దరు ఉత్తమ డ్రైవర్లు ఎంపికయ్యారు.
సిటీ కేటగిరీలో సింహాచలం డిపోకి చెందిన డ్రైవరు ఎస్.ఏ.ఎన్.రాజు (స్టాఫ్ నెం. 455227) ఎంపికయ్యారు. రాజు తన 33 సంవత్సరాల 10 నెలల సర్వీసు కాలంలో ఇప్పటివరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా తన ఉద్యోగాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా, మోఫిస్సిల్ కేటగిరీలో ఆత్మకూరు (కర్నూలు) డిపోకి చెందిన డ్రైవరు ఏ.ఎం. బాషా( స్టాఫ్ నెం. 401962) ఎంపికయ్యారు. శ్రీ బాషా తన 36 సంవత్సరాల 6 నెలల సర్వీసు కాలంలో ఇప్పటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు.
అవార్డులు గెలిచిన డ్రైవర్లు వారివారి కుటుంబ సభ్యుల సమక్షంలో అల్కా ఉపాధ్యాయ , (సెక్రటరీ, MoRTH) చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు.
డిల్లీలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) కే. ఎస్. బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఏ.పి.ఎస్. ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుందని, ఎప్పటికప్పుడు డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. ఎస్. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ASRTU ప్రకటించిన ఈ అవార్డులకు ఎంపికైన డ్రైవర్లను ఆయన అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని యావన్మంది డ్రైవర్లు అదే బాటలో పయనిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యం ప్రయాణీకుల క్షేమం కోసం సురక్షితమైన డ్రైవింగ్ చేసే డ్రైవర్లు నిజంగా హీరోలని పలువురు ప్రశంసించారు.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. లో డ్రైవర్లుగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. పొందిన ఖ్యాతిలో మేము భాగస్వాములయినందుకు ఆనందంగా ఉందని అవార్డులు అందుకున్న డ్రైవర్లు తమ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో 2, 3 సార్లు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. అవార్డులు పొందామని, ఇపుడు జాతీయ స్థాయి అవార్డు పొందడం సంతోషంగా ఉందని డ్రైవర్లు వివరించారు.
దేశం మొత్తం మీద 42 మంది డ్రైవర్ హీరోలను సత్కరించడం గొప్ప విషయమని పాల్గొన్న వివిధ ఆర్టీసీల ఉన్నతాధికారులు కితాబు ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *