విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైద్య రంగానికి విశిష్ఠ సేవలందిస్తోన్న కామినేని హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్‌లో తాజా పురోగతులపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)ని విజయవాడ కామినేని హాస్పిటల్ లోని ఆడిటోరియంలో జరిగింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు డయాగ్నోస్టిక్స్ రంగంలో తాజా పురోగతులపై సెషన్ల వారీగా చర్చించారు. ఈ అంశంపై వైద్య నిపుణులు కొన్ని కీలక ప్రసంగాలు చేశారు.
జెనెటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ రంగాలలో నిష్ణాతులైన డా. అన్నీ క్యూ హసన్, సీనియర్ కన్సల్టెంట్ జెనెటిసిస్ట్, సర్టిఫైడ్ జెనెటిక్ కౌన్సెలర్, డా. లక్ష్మీ, ల్యాబ్ డైరెక్టర్, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ డా. గురు ప్రసాద్ లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. వైద్యుల కోసం మైక్రోబయాలజీ ఎసెన్షియల్స్, మైకోబాక్టీరియాలజీ, ఆటోమేటెడ్ డయాగ్నొస్టిక్ సిస్టమ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తో పాటు బాక్టీరియాలజీ కోసం డయాగ్నొస్టిక్ టెస్ట్‌లు వంటి వివిధ అంశాలపై చర్చించారు. రోగనిర్ధారణలో మాలిక్యులర్ బయాలజీ ప్రాముఖ్యత, జన్యు పరీక్ష, ఆటో ఇమ్యూన్ వ్యాధి, మల్టీప్లెక్స్ పీసీఆర్, హెచ్ఐవీ పీసీఆర్, హెపటైటిస్ బీ అండ్ సీ వైరల్ లోడ్, హెచ్ఎల్ఏ క్రాస్-మ్యాచింగ్ వంటి వివిధ వ్యాధులకు సంబంధించిన వ్యాధి నిర్ధారణలపై కూడా వైద్య నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు.
ప్రతి సెషన్ పూర్తి అయిన తరువాత ప్రశ్నోత్తరాల సెషన్ ను చేపట్టారు. దీనిలో కార్యక్రమానికి హాజరైన వారి ప్రశ్నలకు నిపుణలు జవాబులు ఇచ్చారు. దీంతో చాలామంది మంది వైద్యులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. హాజరైన వారిలో వైద్యులు, వైద్య నిపుణులు, వివిధ వైద్య సంస్థల విద్యార్థులు ఉన్నారు.
ఈ సందర్భంగా విజయవాడలోని కామినేని హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ నవీన్ మాట్లాడుతూ.. “కామినేని హాస్పిటల్స్‌లో డయాగ్నోస్టిక్స్‌లో తాజా పురోగతులపై నిర్వహించిన సీఎంఈ కార్యక్రమం విజయవంతమైంది. హాజరైన వారికి విలువైన సమాచారం అందించడం ఏంతో ఆనందాన్ని ఇస్తోంది. అంతేగాకుండా అనేకమంది సందేహాలు నివృతి చేసినందుకు నిపుణులకు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి కామినేని హాస్పిటల్ కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో వైద్య నిపుణులు తమ రంగంలో వస్తున్న తాజా పురోగతులను తెలుసుకోవడానికి, అప్‌డేట్ గా ఉండేందుకు ఈ కార్యక్రమాలు గొప్ప అవకాశాలుగా చెప్పవచ్చు.” అని అన్నారు.