వర్మి కంపోస్ట్ యూనిట్ మరియు నగరంలోని 45 వ డివిజన్ పారిశుధ్య నిర్వహణను పరిశీలించిన

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
45 వ డివిజన్ కబేళా లోని వర్మి కంపోస్ట్ యూనిట్ ను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ నగరంలో లభ్యమైయే తడి వ్యర్ధపదార్దములను సేకరించి వర్మి కంపోస్ట్ యూనిట్ లో వానపాముల ద్వారా సేంద్రియ ఎరువుగా మార్చే కంపోస్టింగ్ విధానమును శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్లాంట్ లో జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేసినారు. ప్లాంట్ నందు ఎంత కంపోస్టింగ్ ఉత్పత్తి అవుతుంది అని వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.తదుపరి 45 వ డివిజన్ లోని సితార సెంటర్, కబేళా, మిల్క్ కాలనీ, అంబేద్కర్ రోడ్డు పలు వీధులలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్స్ సిల్ట్ తొలగించు పనులను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగితెలుసుకొనిన డివిజన్ పరిధిలో ప్రధాన మరియు అంతర్గత రోడ్లను శుభ్రపరస్తున్న విధానము మరియు సైడ్ డ్రెయిన్ నుండి సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించి డ్రెయిన్ అడుగువరకు గల సిల్ట్ ను తొలగించేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో జోనల్ కమిషనర్-1 ఎ.రాంబాబు, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *