– క్రమశిక్షణ, దాతృత్వం ,ధార్మిక చింతనల కలయికే రంజాన్.
– పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే దివ్య ఖురాన్ ముఖ్యోద్దేశం.
– 3వ రోజున 250 పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వoకార్యక్రమంలో భాగంగా 15 వ రోజు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో 3వ రోజున పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని 250 పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకను పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మరియు నాయకులు పంపిణీ చేసినారు. ఈ మూడు రోజుల్లో పశ్చిమ నియోజకవర్గానికే పరిమితమై 2250 పైచిలుకు రంజాన్ కానుకలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అల్లా ఆశీస్సులతో ఉన్నతమైన జీవితం గడపాలని భగవంతుడు అల్లాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ముస్లిం మత పెద్దల బోధనలలో దౌర్జన్యాలు చేసే వ్యక్తికి కూడా సాయం చేయాలని, అంటే దౌర్జన్యాలు చేసే వ్యక్తి యొక్క చేయ్యాని పట్టుకొని అతని దౌర్జన్యాలను నిలుపు చేయడమే అతనికి చేసే సాయం అని, దౌర్జన్యానికి గురికాబడ్డ వ్యక్తికి కూడా అండగా నిలవాలని నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల్ని బాధిస్తూ అక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని నిలువురించాలంటే రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి శ్రీనివాసరావు, పులి చేరి రమేష్ ,తొత్తడి భరత్, బోట్టా సాయి, బావిశెట్టి శ్రీను, ,సోమి మహేష్, బొబ్బూరి కొండలరావు, పల్లంట్ల ఆది, నూకరాజు,నాగోతి సాయి,పైలా పవన్, ప్రశాంత్ , పండు, నాగరాజు ,నగేష్ ,పైలా రోహిత్, తదితరులు పాల్గొన్నారు
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …