విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో ఐజా గ్రూప్ చైర్మన్, జనసేన నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ (ఐజా) ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్‌ను పురస్కరించుకొని పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. శుక్రవారం భవానిపురంలోని మసీదే రజా వీధిలోని మసీదు వద్ద వేలాది మంది ముస్లిం కుటుంబాలకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గయాజుద్దీన్ (ఐజా) మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున మరియు పవన్ కళ్యాణ్ తరపున, ఐజా గ్రూప్ తరఫున తెలియజేస్తున్నామని భగవంతుడు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున ప్రతి ఏటా క్రమం తప్పకుండా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇస్తున్నామన్నారు. సుమారు 2 వేల మంది ముస్లిం కుటుంబాలకు తోఫా పంపిణీ చేశామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో నిష్టగా అల్లాహ్ ను ప్రార్థించడం జరుగుతుందని, ముస్లీం ప్రతి కుటుంబంలో రంజాన్ పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఐజా చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. తోఫా పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …