రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కడియం మండలం లో కోత కోసిన ధాన్యం రవాణా విషయమై ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియచేశారు. శనివారం పౌర సరఫరాల, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి కడియం గ్రామంలో ఆవ తదితర ప్రాంతాల్లో పర్యటించి, రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణను పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే సేకరణ చెయ్యడం జరుగుతోందని తెలియచేశారు. గత ఖరీఫ్ లో ఆఫ్ లైన్ లో చేసిన లావాదేవీలకు సంబంధించి ఇంకా 512 మెట్రిక్ టన్నుల ధాన్యం చెల్లింపులు జరగలేదని, ఆ మొత్తాన్ని సంబంధిత మిల్లర్ ద్వారా చెల్లింపులు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రబీ నుంచి పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలను నిర్వహించనున్నట్లు జేసీ తెలిపారు. కడియం గ్రామంలో రవాణా వ్యవస్థ సరైన రహదారి అందుబాటులో లేని భూముల నుంచి ధాన్యం రవాణా కు సంబందించి స్థానిక ప్రజా ప్రతినిధులతో, రైతులతో, అధికారులతో క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించి, వారి నుంచి సూచనలు స్వీకరించడం జరిగిందన్నారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర లభింప చేసే విధానం పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మేలు జరిగే అవకాశం మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటన లో జేసీ వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డి ఎస్ వో పి. ప్రసాద రావు, ఏ ఎం (సీఎస్) త్రినాధ్ రావు, స్థానిక నాయకులు గిరిజాల బాబు, పలువురు స్థానిక నాయకులు, రైతులు, తహశీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …