బొమ్మలు గీయడం కోసం ప్రభుత్వఉద్యోగాన్ని సైతం వదులుకున్న చిత్రకారుడు బాలి

-బాలి సంతాప సభలో వక్తలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని బొమ్మలు గీయడమే నా పని ఆత్మవిశ్వాసంతో చెప్పిన గొప్ప చిత్రకారుడు బాలి అని అన్నారు కామ్రేడ్ జీఆర్కె -పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు. సుప్రసిద్ధ చిత్రకారుడు, కార్టూనిస్టు, కథకుడు బాలి సంతాప సభ స్థానిక ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో శనివారం సాయంత్రం జరిగింది. మల్లెతీగ, కామ్రేడ్ జీఆర్కె -పోలవరపు సాంస్కృతిక సమితి, జాషువా సాంస్కృతిక వేదిక, 64 కళలు. కామ్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభకు గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. అతిధిగా కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి. జమలాపూర్ణమ్మ హాజరై బాలి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ- తాను ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న రోజుల్లో బాలితో వున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. బాలి గొప్ప చిత్రకారుడుగా తెలుసు. కానీ ఇటీవలే కథకులుగా కూడా రాణించారన్న విషయం తెలిసిందన్నారు. మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ మాట్లాడుతూ-కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా ప్రసిద్ధి పొందిన బాలి చివరి దశలో కథలు రాశారన్నారు. బాలి కథా సాహిత్యాన్ని ‘బాలి కథలు’ పేరుతో గ్రంథంగా తీసుకొచ్చే అదృష్టం మల్లెతీగకు దక్కిందన్నారు. 64 కళలు. కామ్ ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ- ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా వుండే బాలి తన కొడుకు అమెరికాలో మంచుతుపానులో చిక్కుకుని చనిపోయిందగ్గర నుండి బాలి గారు బాధకు లోనై అనారోగ్యం పాలయ్యారన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, సీనియర్ కార్టూనిస్టు ఏవియం సభలో పాల్గొని బాలి చిత్రపటానికి నివాళు లర్పించారు. కార్యక్రమంలో రచయితలు గుమ్మా సాంబశివరావు, డి. శమంతకమణి, దుబ్బాక కార్తీక్, వెన్నా వల్లభరావు, చిత్రకారులు గిరిధర్, చిదంబరం, అల్లు రాంబాబు, కార్టూనిస్టులు డాక్టర్ రావెళ్ళ, ఆదినారాయణ, నాగిశెట్టి, విష్ణుభొట్ల రామకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *