జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపుకి విశేష స్పందన

-తొలిరోజు సాయంత్రం 6 గం.ల వరకు 1,120 మంది జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య పరీక్షల నిర్వహణ
-ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందిన జర్నలిస్టులకు రేపు వైద్యులచే కన్సల్టేషన్
-ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,  విడదల రజిని, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు, -హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ కు , నిరంతరాయంగా వైద్య సేవలందించిన ఆరోగ్యశ్రీ సిబ్బంది మరియు పాల్గొన్న 22 ఆస్పత్రుల యాజమాన్యాలు, సిబ్బందికి కృతజ్ఞతలు
-సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ శిబిరానికి విశేష స్పందన లభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం విజయవాడలోని ఆంధ్రా లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రోజులు కొనసాగే ఉచిత వైద్య శిబిరంలో తొలిరోజు 1,120 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,  విడదల రజిని, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు, హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు. సేవలందించిన ఆరోగ్యశ్రీ సిబ్బందికి, 22 ఆస్పత్రుల యాజమాన్యాలకు, వారి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తొలిరోజు వైద్య పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల వైద్య రిపోర్ట్స్ వెలువడిన అనంతరం రేపు ఉదయం 7 గం.ల నుండి వైద్యులచే కన్సల్టేఫన్ ఉంటుందన్నారు. నిరంతరాయంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు వైద్య సేవలు అందించిన పిన్నమనేని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్మైల్ హాస్పిటల్, శంకర నేత్ర చికిత్సాలయ, మాక్స్ విజిన్ ఐ హాస్పిటల్, అన్షు ఆర్దో అండ్ ఈఎన్ టీ, ఆంధ్రా హాస్పిటల్స్, సెంటిని హాస్పిటల్, కామినేని, కేపిటల్ హాస్పిటల్, ఆపిల్ డెంటల్ కేర్ మరియు పార్ధ డెంటల్ కేర్, ఉషా కార్డియాక్ సెంటర్, అమెరిక్ ఆంకాలజీ ఇన్ స్టిట్యూట్, ఇండో బ్రిటీష్ హాస్పిటల్, హెచ్ సీజీ క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్, గ్లోబల్ ఎంటర్ ప్రైసెస్ హార్ట్ కేర్ సెంటర్, సన్ రైజ్ హాస్పిటల్, స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ అను హాస్పిటల్, శ్రీధర్ డెంటల్ హాస్పిటల్, మణిపాల్, గ్రేస్ హా క్యాన్సర్ మొబైల్ కేర్ యూనిట్స్ హాస్పిటల్ ల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *