విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ‘సేనాని (ప్రజా సేవకుడు)’ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన నగరంలో ‘సేనాని (ప్రజా సేవకుడు)’ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిధులుగా జనసేన నాయకులు పోతిన వెంకటమహేష్, షేక్ రియాజ్, అడ్డూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనసేనాని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంను బయోపిక్‌గా దృశ్యం రూపంలో మలిచినందుకు చిత్ర యూనిట్ అభినందించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించి దీనిలో నటించి ప్రతివారికి మరిన్ని అవకాశాలు రావాలన్నారు. నేటి యువతలో పవన్‌కళ్యాణ్‌కు వున్న అభిమానాన్ని గుర్తుచేసి ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకుని యువత ముందుకు నడవాలన్నారు. ప్రొడ్యూసర్ పగడాల శ్రీయ, పగడాల కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ పవన్‌కళ్యాణ్ హీరోగా, స్టోరీ, స్త్క్రీన్‌ప్లే, డైరెక్షన్ శివరామ్‌కుమార్ సవరం, మూలకథ, రచయిత దాలియ నాయుడు బొండుపల్లి, కెమెరామెన్ కె.రమణ, సంగీతం ఎస్.కె.బాజీ, ప్రొడక్షన్ మేనేజర్ ఎస్.ఎన్.రోహిణికాంత్, ఆర్టిస్ట్ కో ఆర్డినేటర్ ఎస్.ఎన్.నాయుడు తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్, అభిమానులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …