ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దం చేయండి..

-తక్కువ పెట్టుబడితో అధిక తిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దం చేయాలని, సేంద్రియ పద్దతులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞనాన్ని అనుసరించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుల సమావేశాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని ఆయన విడిది కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 43 వేల ఎకరాలలో వరి పంటను మెట్టప్రాంతంలో మిరప, వెరుశనగ, కంది, పత్తి పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తారన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సిద్దంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ, కంది, రాగులు విత్తనాలను ఆదర్శ రైతులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరి సాగు చేసే రైతులకు సబ్బిడీపై వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సేద్యంలో భాగంగా ఘనజీవామృతం వినియోగించడం వలన భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులకు ఆహారం లభించి అవి ఇబ్బడి బ్బుడిగా వృద్ధి చెందుతాయన్నారు. సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందడం ద్వారా పోషకాలను మొక్కల వేర్లకు అందుబాటులో తీసుకువస్తాయన్నారు. తృణధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, వెదచల్లి పంటలను చేపట్టి సూక్ష్మ జీవుల అభివృద్ది చేసుకునేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. సేద్య సన్నద్ద పంటలైన జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలు, పెసలు, శనగలు, మినువులు, నువ్వులు, ఆవాలు, జీలుగ, కట్టె జనుము, పిల్లిపెసర, బెండ, గోరుచిక్కుడు తదితర పంటలను చేపట్టడం వలన నేల కోతను అరికట్టుకోవడం జీవ వైవిద్యం పెరగడం, సూక్ష్మ జీవుల అభివృద్ధి, వర్షపు నీరు భూములలో ఇంకడం, భూతాపం తగ్గడంతో పాటు పశుగ్రాసానికి ఎంతో దోహదపడతాయని రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయ విత్తన శుది విత్తన గురికలు తయారి ఉపయోగాలు ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఆచ్ఛాదన, పంటల వైవిధ్యం వంటి విషయాలలో రైతులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. సమగ్ర వ్యవసాయ పద్దతులకు సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను ముద్రించి గ్రామాలలో పంపీణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ వంటి ద్రావణాలను గ్రామాలలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తద్వారా వాటిని రైతులు పెంటపోగులపై పిచికారి చేసి కుళ్లించడం ద్వారా మేలుకరమైన బ్యాక్టిరియా తయారి అయి పంట పొలాలలకు మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మిరప పంటను ఆశించే నల్ల తామర పురుగు నివారణ పద్దతులపై రైతులలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అగ్రి కల్చర్‌ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ డి. దామోదరరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌ నాగమణెమ్మ, ఉద్యాన శాఖ అధికారి ఏడి బాలజీకుమార్‌, పశు సంవర్థక శాఖ అధికారి కె. విద్యా సాగర్‌, ఏపియంఐపి పిడి సుభాని, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఎస్‌ సత్యనారాయణ, మార్క్‌ఫడ్‌ డియం అనిత, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వర్లు, సలహా మండలి సభ్యులు కాజ బ్రహ్మయ్య, షేక్‌ నాగుల మీరా, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *