పాఠశాలల పున ప్రారంభం రోజునే

-జగనన్న విద్యా కానుక కిట్లు అందించాలి..
-నాడు-నేడు పనులు వేగంగా పూర్తి కావాలి..
-జగనన్న విద్యా కానుక కిట్ల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్‌.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులకు అనుగుణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలలో పురోగతి చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఉపాధ్యాయులను ఆదేశించారు.గంపలగూడెం మండలం సత్యాలపాడు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గురువారం సందర్శించి జగనన్న విద్యా కానుక కిట్ల నాణ్యతను, నాడు నేడు రెండవ దశ పనులను పరిశీలించి పురోగతిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని 17 మండలాల్లో విజయవాడ అర్బన్‌ తో సహా 951 పాఠశాలలు ఉండగా వీటిలో 750 పాఠశాలలకు సంబంధించి ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్‌ పాయింట్లకు జగనన్న విద్యా కానుక కిట్లను ఇప్పటికే పంపిణీ చేశారన్నారు. ఇంకనూ పంపిణీ చేయవలసిన 208 పాఠశాలలకు రేపటిలోగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసి ఈ నెల 12వ తేదీ పాఠశాలల పునః ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థికి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. పునః ప్రారంభం అయిన మొదటి రోజే విద్యా కానుక కిట్లు విద్యార్థులకు అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలన్నారు. తరగతుల వారీగా జిల్లా కేంద్రం నుంచి పాఠశాలకు వచ్చిన కిట్లను సరిచూసుకోవాలని కోరారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా విద్యా కానుక కిట్లు కొనుగోలు చేసిందన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లలోని పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌, బెల్టు, యూనిఫారం, నోట్‌ బుక్స్‌, షూస్‌, సాక్సులు, ఆక్స్ఫర్డ్‌ నిఘంటువు వాటిని ఉపాధ్యాయులు ముందుగా తనిఖీ చేసుకోవాలన్నారు.జిల్లాలో చేపడుతున్న రెండవ విడత మన బడి నాడు`నేడు అభివృద్ధి పనులను పూర్తి చేసి పాఠశాల ప్రారంభం నాటికి సిద్దం చేయాలన్నారు. నాడు`నేడు అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత మండల యంపిడివోలు, యంఇవోలు, ఆయా శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈనెల 12వ తేదిన పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా తరగతి గదులలో చేపట్టవలసిన చిన్నచిన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి సిద్దంగా ఉంచుకోవాని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.అనంతరం మీడియాప్రతినిధులతో కలెక్టర్‌ మాట్లాడుతూ తోటమూల వై జంక్షన్‌ పక్కన అక్రమణలో ఉన్న 84 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. కట్టలేరు వంతెన నిర్మాణానికి త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నార్కిన్‌పాడు వద్ద సెల్‌టవర్‌ ఏర్పాటు చేసి పరిసర గ్రామాలలోని ప్రజలు ఎదుర్కొంటున్న సిగ్నల్‌ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.పరిశీలనలో కలెక్టర్‌తో పాటు ఆర్‌డివో వై వి ప్రసన్నలక్ష్మి, యంపిడివో వై పిచ్చిరెడ్డి, తహాశీల్థార్‌ బాలకృష్ణరెడ్డి, యంఇవో సోమశేఖరనాయక్‌, సత్యాలపాడు గ్రామ సర్పంచ్‌ వి.గోవర్థన్‌రెడ్డి, పెనుగొలను గ్రామ సర్పంచ్‌ పి.లలిత, ఎవో సావిత్రి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *