విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమటలంక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని 2023 విద్యా సంవత్సరానికి గాను చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5గురు పదవ తరగతి మరియు 3గురు ఇంటర్మీడియట్ విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న సన్మానించి సత్కరించి మెడల్స్ తో పాటు నగదు ప్రోత్సాహంను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రతిభ గల ప్రతి విద్యార్థిని ప్రోత్సహించి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే తమ జగనన్న ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం తీసుకోసం విద్యార్థుల పట్ల వారి భవిష్యత్తు పట్ల ఆయనకున్న శ్రద్ధ, బాధ్యతలను తెలియజేస్తుందని అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను మరింత వెదికి తీసి వారి భవిష్యత్తు చదువులను మరింత ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించి భావి భారత విద్యార్థులను మరింత ప్రోత్సహించే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాధికారి రవి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,9వ డివిజన్ ఇంచార్జ్ ఈశ్వర ప్రసాద్,వైస్సార్సీపీ నాయకులు సుబ్బరాజు,ధనరాజు,కాళీ,కళ్యాణ్,రవికుమార్,రాజశేఖర్ పాల్గొన్నారు.`
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …