50 కోట్లు డిపాజిట్ లకు చేరి త్వరలో 2 బ్రాంచీలకు ఆర్.బి.ఐ అనుమతి పొందిన శ్రీ శారదాంబా బ్యాంకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శార దాంబ మహిళ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సమావేశం స్థానిక గాయత్రీ కళ్యాణ మండపం లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోపరేటివ్ బ్యాంక్ చైర్ పర్సన్ శిష్ట్లా కుసుమ లావణ్య దేవి మాట్లాడుతూ ఈ బ్యాంకు 25 సంవ త్సరాలుగా విజయవంతంగా నడుస్తూ 26వ సంవత్సరంలో అడుగు పెట్టిం దని అన్నారు మొదట 13 కోట్ల రూపాయలతో ప్రారంభమైన బ్యాంకు 50 కోట్లు డిపాజిట్ వరకు చేరుకుందని త్వరలోనే 2 బ్రాంచీలకు ఆర్.బి.ఐ అనుమతి లభించిందని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని, అన్నారు ముఖ్యంగా మహిళ షేర్ హెూల్డర్స్ కు డైరెక్టర్లకు కస్టమర్ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈసందర్భంగా బ్యాంకు అభివృద్ధికి సహకరించిన, వారికి బ్యాంకు సేవలు అందించే సిబ్బందికి శాలువాలుతో సత్కరించారు. తదనంతరం బ్యాంక్ డైరెక్టర్స్ మాట్లా డుతూ అన్ని బ్యాంకులకు దీటుగా అన్ని పథకాలలో మా బ్యాంకు ముందుకు సాగుతుందని, సీనియర్ సిటిజన్స్ కుఎన్నో పథకాలు ఉన్నాయని అన్ని దిగ్విజయంగా నడుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా మా మహిళ షేర్ హోల్డర్స్ కు మరియు డిపా జిట్ దారులు కు కృతజ్ఞతలు తెలుపు తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పా లక్ష్మీదేవి, రాయంపూడి అమూల్య, గండూరి లక్ష్మీ అపర్ణ, వి నాగమణి, మద్ది జ్ఞానమాంబ పి. రాధిక, బ్యాంకు సిబ్బంది తది తరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *