దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

విజయవాడ నగరంలో పేద ప్రజలకు అండగా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్, దర్శిపేట రాజరాజేశ్వరి కళ్యణ మండపం నందు దేవినేని నెహ్రు చారిటబుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్,రాష్ట్ర వైస్సార్సీపీ నాయకులు కడియాల బుచ్చిబాబు,డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ ప్రారంభించి ప్రజలకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు స్వర హాస్పిటల్ డాక్టర్ లు వివిధ రకాల పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది అని అన్నారు. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా విద్యార్థుల చదువు కొరకు, మహిళల స్వయం ఉపాధి కొరకు ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్ గారు సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ చింతల సాంబయ్య,వైస్సార్సీపీ నాయకులు సన్నీ,శెటికం దుర్గ,ఈశ్వర ప్రసాద్,రామయనపు శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *